అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

Dec 20,2023 19:50

సీతంపేట: సీతంపేట, వీరఘట్టం, భామిని ప్రాజెక్ట్‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. మూడు ప్రాజెక్టుల్లో 17 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా వీటిలో 16 ఉద్యోగాలకు 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాలకొండ ఆర్‌డిఒ లావణ్య, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాధరావు, ఐసిడిఎస్‌ నీడీ ఎంఎన్‌ రాణి, సిడిపిఒలు, పి.రంగలక్ష్మి, సూపర్‌ వైజర్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️