ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు వంటావార్పు

Jan 1,2024 20:48

పార్వతీపురంరూరల్‌ : సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లతో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం పార్వతీపురంలో ఆ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు 13వ రోజు సోమవారం కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం చర్చి కూడలి నుంచి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతర నిరసన శిబిరం ఎదుట వంటా వార్పూ నిర్వహించారు. అనంతరం సమస్యలు తెలియజేస్తూ ముఖ్యమంత్రికి పోస్ట్‌ కార్డుల ఉద్యమం నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణతో పాటు పలువురు నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు రమేష్‌, లక్ష్మణరావు, భారతి, వందన, దమయంతి, జెఎసి నాయకులు పోలినాయుడు, ఈశ్వరరావు, రమేష్‌, భాను, దివాకర్‌, అప్పారావు, దేవిశ్రీ, గౌరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️