ఒపిఎస్‌ను అమలు చేయాలి

Feb 16,2024 21:48

పార్వతీపురంరూరల్‌ : ఎన్‌పిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను తిరిగి అమలు చేయాలని పోస్టల్‌ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పార్వతీపురంలో ఉద్యోగ సమయం ముగిసిన తర్వాత ఆ సంఘం నాయకులు గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిష్కతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఎన్‌ఎఫ్‌పిఇ కోఆర్డినేషన్‌ కమిటీకి సహకరించాలని కోరుతూ 8వ వేతన సవరణ కమీషన్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎఫ్‌పిఇ, ఎఐపిఇయుల్లో గ్రేట్‌ సి సంఘాల గుర్తింపును తిరిగి పునరుద్ధరించాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిలిపివేసిన 18నెలల కరువు భత్యం బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి, ప్రభుత్వరంగ సంస్థల కార్పొరేటీకరణ/ ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగుల సంఘం నాయకులు జె.రవీంద్ర, బి.ఉమా శంకరరావు, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️