కరాటేలో గిరిజన విద్యార్థి ప్రతిభ 

Dec 11,2023 20:50

పార్వతీపురం రూరల్‌ : మండలంలోని పెదమరికి ఎంపియుపి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న హిమరక నాని ఎపి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ వారు నిర్వహించిన కరాటే పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపించి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించినట్లు కోచ్‌ ఎస్‌.నాగేశ్వరరావు, చీప్‌ కోచ్‌ జి.గోపాల్‌ తెలిపారు. ఈ మేరకు నానిని డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, డిఎస్‌డిఒ వెంకటేశ్వరరావు, ఎస్‌జిఎఫ్‌ జిల్లా సెక్రెటరీ డిటి గాంధీ శాలువాతో పూలమాలలు వేసి సన్మానించారు.

➡️