కుక్కల దాడిలో మేకపిల్లల మృతి

Jan 1,2024 20:39

సాలూరు: పట్టణానికి చెందిన గొర్రెల కాపరి రంది అచ్యుత్‌కు చెందిన మేకపిల్లలు కుక్కల దాడిలో మృతి చెందాయి. ఆదివారం తన కళ్లంలోని పశువుల శాలలో మేకపిల్లలు పెంచుతున్న అచ్యుత్‌ తాళం వేయకుండా వదిలేశాడు. దీంతో కుక్కలు దూరి మేకపిల్లలపై దాడి చేశాయి. మొత్తం తొమ్మిది పిల్లలు మృతి చెందినట్లు కాపరి అచ్యుత్‌ తెలిపారు.

➡️