గడపగడపకూ నిధులతో జనవరిలోగా పనులు

Dec 24,2023 21:37

సాలూరు :మున్సిపాలిటీలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదించిన పనులు జనవరిలోగా పూర్తి చేయాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఆదేశించారు. ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం, ఎఇ సూరినాయుడు ఆయన్ను కలిసిన సందర్భంగా మాట్లాడారు. సచివాలయానికి రూ.20లక్షలు చొప్పున నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జనవరిలోగా పనులు పూర్తి చేస్తే బిల్లులు మంజూరవుతాయన్నారు. వార్డు కౌన్సిలర్లు, ఇంఛార్జిలు ఈ పనులు త్వరితగతిన జరిగేలా చూడాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్‌ సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన గ్రాంట్లుతో చేపట్టాల్సిన పనులు కూడా వేగవంతం చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.

➡️