జెకెసికి పోటెత్తిన ఫిర్యాదులు

Jan 29,2024 20:49

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిచిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఫిర్యాదారుదారులతో పోటెత్తింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 192మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలపై వినతులను కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు అందజేశారు. వినతులను ఆయతో పాటు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, కె.కె.ఆర్‌.సి. ఎస్‌.డి.సి. జి.కేశవనాయుడు, ఆర్‌.డి.ఒ. కె.హేమలత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందజేసిన వినతులకు సకాలంలో పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కార్యక్రమంలో అన్నిశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కొత్తవలస నిర్వాసితులకు పట్టాలు పంపిణీరైల్వే మూడో లైన్‌ నిర్మాణంలో భాగంగా కొత్తవలసలో నిర్వాసితులైన 14 కుటుంబాలకు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పట్టాలు పంపిణీ చేశారు. వెంకంపేట అర్బన్‌ లే అవుట్‌లో నిర్వాసిత 14 కుటుంబాలకు పట్టాలు జారీ చేశారు.కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఆర్‌డిఒ కె.హేమలత, కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి జి కేశవనాయుడు, తహశీల్దార్‌ శివన్నారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️