నేడు పోలమాంబ మారు జాతర

Jan 29,2024 20:45

మక్కువ: శంబర పోలమాంబ అమ్మవారి మారుజాతర మంగళవారం జరగనుంది. ఈ జాతరకు సంబంధించి దేవాదాయ శాఖ ఇఇ వివిఎస్‌ నారాయణ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. వనంగుడి వద్ద అమ్మవారిని భక్తులు దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్లను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అమ్మవారి వేప చెట్టు దగ్గర మొక్కులు తీర్చుకునే భక్తుల కోసం పసుపు, కుంకుమ దీపాలు పూజా సామాగ్రిని అందుబాటులో ఉంచామని ఇఇ తెలిపారు. గతవారం కంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సిఐ ధనుంజరురావు ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఐ నరసింహమూర్తి పర్యవేక్షణలో 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే సాలూరు, పార్వతీపురం, విజయనగరం డిపోల నుండి బస్సులను భక్తుల సౌకర్యార్థం తిప్పనున్నారు.

➡️