న్యాయవాదుల విధుల బహిష్కరణ

Jan 2,2024 22:05

సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ -23 రద్దు చేయాలని కోరుతూ స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షులు తాడ్డి తిరుపతిరావు ఆధ్వర్యాన న్యాయవాదులు కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. భూములపై ప్రభుత్వ పెత్తనం వహించేలా చట్టం రూపకల్పన చేయడంతో పేదలకు నష్టదాయకమన్నారు. వెంటనే ఈ చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు వేణుగోపాలరావు, సభ్యులు కర్రి సన్యాసి రావు, జి.అప్పలనాయుడు పాల్గొన్నారు.కోర్టు వద్ద నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

➡️