పత్రాలిచ్చారు… ప్రవేశాలు మరిచారు

Mar 23,2024 20:29

సాలూరు : పట్టణంలోని పేదలకు సంబంధించిన టిడ్కో గృహ సముదాయంలో నెలరోజుల క్రితం అట్టహాసంగా ప్రవేశాలు జరిగాయి. డిప్యుటీ సిఎం రాజన్నదొర 1056 మంది టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు హక్కు పత్రాలను అందజేశారు. ఈ ఇళ్లకు విద్యుద్దీకరణ పనులకు సంబంధించి పనులు పూర్తయ్యాయి. కానీ లబ్దిదారుల ఇళ్లకు విద్యుత్‌ మీటర్ల విషయంలో స్పష్టత లేదు. లబ్దిదారులు స్థానిక ఎడిఇ కార్యాలయంలో విద్యుత్‌ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని చెపుతున్నారు. కానీ ఇంతవరకు ఒక్కరూ దరఖాస్తు చేసుకున్న దాఖలాల్లేవు. 1.5 ఎంవి సామర్థ్యం కలిగిన మీటర్‌ కోసం రూ.269 చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. అయితే టిడ్కో లబ్దిదార్లు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. మరో పక్క ఈ గృహ సముదాయాలకు తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు కూడా పూర్తి కాలేదు. గుమడాంకు వేగావతి నది ప్రాంతం నుంచి పైపులైన్‌ ద్వారా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేశారు. నదిలో ఇన్‌ ఫిల్ట్రేషన్‌ బావుల నిర్మాణం జరిగింది. పైపులైన్‌ నిర్మాణ పనులు కూడా 90 శాతం పూర్తయ్యాయి. 3.6 కిలో మీటర్ల పొడవున పైపులైన్‌ నిర్మాణం చేపట్టాలి. ఎంపిడిఒ కార్యాలయం వద్ద రైల్వే ట్రాక్‌ ఉండడంతో సంబంధిత శాఖ అధికారుల అనుమతి మంజూరైంది. రైల్వే ట్రాక్‌ కింద నుంచి పైపులైన్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పదిరోజుల్లో మిగిలిన పైపులైన్‌ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని టిడ్కో అధికారులు చెబుతున్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులకు రూ.6.5 కోట్లు నిధులు మంజూరయ్యాయి. విద్యుత్‌ మీటర్ల కోసం దరఖాస్తు విషయంలో విద్యుత్‌ అధికారులు స్పష్టత ఇస్తున్నా లబ్దిదారులు మీటర్ల కోసం దరఖాస్తు చేయడానికి ముందుకు రావడం లేదు.పదిరోజుల్లో పైపులైన్‌ నిర్మాణంటిడ్కో ఎఇ ప్రవీణ్‌టిడ్కో ఇళ్లకు తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఎంపిడిఒ కార్యాలయం వద్ద రైల్వే ట్రాక్‌ కింద నుంచి పైపులైన్‌ నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూర య్యాయి. పదిరోజుల్లో పనులు పూర్తి చేస్తాం.

➡️