ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించిన రైతు, కార్మిక సంఘాలు

Feb 16,2024 21:44

 కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం కార్మిక, రైతు, ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ భారత్‌ బంద్‌ విజయవంతమైంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపికి బుద్ధి చెప్పాలంటూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల నాయకులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పార్వతీపురంరూరల్‌ : సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన గ్రామీణ బంద్‌కు మద్దతుగా సూరంపేట ఎఫ్‌సిఐ గిడ్డంగుల కార్మిక సంఘం నాయకుల అధ్వర్యంలో నర్సిపురంలోనూ, పాలకొండ రోడ్డులోని వై జంక్షన్‌ దగ్గర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులు బంటు దాసు, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ మోడీ పాలనలో వ్యవసాయ రంగం నాశనం ఆవుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాలను సైతం నీరుగారుస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా బారతీయ యువతకు ఉపాధి లేకుండా చేస్తోందని విమర్శించారు.ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా మోడీ విధానాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు పెద్దిరెడ్డిల వెంకటరమణ, అక్కిన ధనంజయ, మాగిలపల్లి తిరుపతిరావు, సిరిసిపల్లి శ్రీనివాసరావు, అక్కిన శంకర్రావు, యోగి రెడ్డి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : గ్రామీణ బంద్‌లో భాగంగా ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుంచి బజారు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమాన్‌ జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగే రైతుల పోరాటాలకు మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు రెడ్డి రమణమూర్తి, ఎల్‌ఐసి నాయకులు గొట్టాపు శ్రీనివాసరావు, కళాసీ సంఘ నాయకులు తేలు సత్యం, సిహెచ్‌ కృష్ణ, బి.అప్పారావు, వై.రామారావు తదితరులు పాల్గొన్నారు. సాలూరు : దేశంలో నరేంద్ర మోడీ, బిజెపి అవలంబిస్తున్న కార్మిక కర్షక, రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళన పోరాటాల్లో భాగంగా సాలూరు పట్టణంలో ర్యాలీ, సభ జరిగింది. ర్యాలీ రాజేశ్వరరావు పార్క్‌ వద్ద ప్రారంభమై వెంకటేశ్వర డీలక్స్‌, చిన్న బజార్‌, బోసుబొమ్మ ,పోస్ట్‌ ఆఫీస్‌, గుండా స్టేట్‌ బ్యాంక్‌ వరకు సాగింది. అనంతరం రాజేశ్వరరావు పార్కు వద్ద ప్రారంభమైన సభనుద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు రాముడు, శంకర్రావు మాట్లాడుతూ కార్మిక కర్షక ఐక్యత కాపాడేందుకు మరిన్ని పోరాటాలు నిర్వహించాల్సి ఉన్నదని దానికి కార్మికులంతా సిద్ధపడాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ నాయకులు శ్రీనివాస్‌, సీతా, ఈశ్వరరావు, వెంకన్న, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.బలిజిపేట : మోడీ కార్పొరేట్‌ విధానాలకు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బలిజిపేట లో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గేదెలు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం నాయకులు మావిడి సింహాద్రి నాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో రైస్‌ మిల్‌ యూనియన్‌, ఆటో, రిక్షా నాయకులు పళీల అప్పారావు, బద్దాన భానుమూర్తి, గంట్యాడ బలరాం, వెన్నెల వేణుగోపాల్‌, కూర్మా భాస్కరరావు, లక్షణ, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.సీతంపేట: గ్రామీణ భారత్‌ బంద్‌లో భాగంగా స్థానిక సిఐటియు కార్యాలయం నుండి బస్టాండ్‌ వరకు ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు వామపక్ష నాయకులు వామపక్ష నాయకులు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధరావు మాట్లాడుతూ కార్మిక, రైతు చట్టాలను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు, సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు, సిపిఎం సీనియర్‌ నాయకులు పాలక సాంబయ్య, ఎఐవైఎఫ్‌ కోరంగి గోపి నాయకులు పాల్గొన్నారు.కొమరాడ : సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు కొమరాడలో జరిగిన గ్రామీణ భారత్‌ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. మండల కేంద్రంలో భారీ ర్యాలీ అనంతరం అంతరాష్ట్ర రహదారిపై నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పి.శ్రీనునాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో వివిధప్రజాసంఘాల నాయకులు ఎ.ఉపేంద్ర, కె.వెంకటస్వామి, సంగమ్మ, వెంకటేష్‌, పి.కృష్ణవేణి, ఆర్‌.శివున్నాయుడు, మిన్నారావు, హేమ, గౌర్నాయుడు, చిలకమ్మ, సోములు, అప్పలస్వామి, సింహాచలం, రామస్వామి, పోలి నాయుడు, మాజీ సర్పంచ్‌లు గుంప స్వామి, చోడి సాంబతో కార్మికులు, ఆటోడ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పాలకొండ : దేశవ్యాప్త కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్‌ బంద్‌లో భాగంగా రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాలకొండ చెక్‌పోస్ట్‌ జంక్షన్‌ వద్ద జరిగిన రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ పాలకొండ పట్నంలో మెయిన్‌ రోడ్డు మీదగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ కేంద్ర బిజెపి కార్పొరేట్‌ -మతతత్వ విధానాలను ఐక్య పోరాటాల ద్వారా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల సమన్వయ కమిటీ కార్యదర్శి కాద రాము అభ్యుదయ రైతు సీనియర్‌ రైతు సంఘం నాయకులు ఖండాపు ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు గిరిజన సంఘం మండల ప్రెసిడెంట్‌ ఎస్‌ గంగయ్య ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు మహేష్‌, జగదీష్‌, పి.రాము, జి.హరి, వంశీ, సంతు, కోటి, ఎ.అప్పారావు, ఎల్‌.రాము, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.పాచిపెంట : ఆటో కార్మిక సంఘం యూనియన్‌ నాయకులు పిన్నింటి రమేష్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బోను గౌరి నాయుడు, మాదిరెడ్డి తిరుపతిరావు, బొంగు కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుర్రు రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య, మంచాల శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, చింత పోలిరాజు ఆధ్వర్యంలో పాచిపెంటలో గ్రామీణ బంద్‌ విజయవంతమెంది. ఈ సమ్మెలో ఆటో కార్మికులు స్వచ్ఛందంగా ఆటోలను నిలిపివేశారు.కురుపాం :గ్రామీణ కార్మిక సంఘాలు బంద్‌ సందర్భంగా మండల కేంద్రంలో రావాడ జంక్షన్‌ నుండి బస్టాండ్‌ వరకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బంద్‌ ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించారు .ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు గరుగుబిల్లి సూరయ్య, ఉలక వాసు తదితరులు పాల్గొన్నారు.సాలూరు రూరల్‌ : గ్రామీణ బంద్‌ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మామిడిపల్లిలో బంద్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎఐయుటిసి, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌.రామచంద్రరావు, ఎన్‌వై నాయుడు, టి.జీవ, రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అసిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే దేశంలోని సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్‌ సంస్థలకు అప్పనంగా అందజేస్తారన్నారు. కావున ఈ ప్రభుత్వాన్ని ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వంతల సుందర్రావు, గెమ్మెల జానకీరావు, రైతు కూలీ సంఘం నాయకులు అప్పలస్వామి, రాము, శ్రామిక మహిళా సంఘం నాయకులు నారాయణమ్మ, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం నాయకులు రాజమండ్రి రాము, మంగారమ్మతల్లి, ఆటో యూనియన్‌ నాయకులు జర్జాపు జ్యోతిష్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తాడంగి గాసి, జెమ్మెల బోడమ్మ, చింత జోగయ్య, సూకురు గంగయ్య తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : గ్రామీణ బంద్‌ కార్యక్రమంలో భాగంగా గుమ్మ లక్ష్మీపురంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికులకు ఉద్యోగం భద్రత ఉండాలంటే మోడీ సర్కార్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌, సహాయ కార్యదర్శి రామస్వామి, సిఐటియు మండల కార్యదర్శి కె.గౌరీశ్వరరావు, కుక్కిడి సర్పంచ్‌ బిడ్డిక రాజారావు, చెముడుగూడ ఎంపిటిసి మండంగి రమణ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బి.శంకరరావు, ఎం.సన్యాసిరావు, పి.మోహనరావు, అంగన్వాడీ, ఆశా, రిక్షా, గ్రీన్‌ అంబాసిడర్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.వీరఘట్టం : మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామీణ బంద్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎన్‌.ప్రసాదరావు, పి.ప్రసాద్‌, వి.కాంచన, జయమ్మ, కల్యాణం, సుశీల, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.భామిని: ఆలిండియా కిషాన్‌ సంయుక్త మోర్చా, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి గ్రామీణ బంద్‌ పిలుపు మేరకు స్థానిక అంబేద్కర్‌ కూడలిలో రైతు ,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజా సంఘాల నాయకులు కె. మిన్నారావు, జి.జగన్నాయుకులు, కె.భాస్కరరావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జి.ప్రసాద్‌ ,జి.పుష్పనాధం పాల్గొన్నారు.గరుగుబిల్లి : ఆలిండియా కిషాన్‌ సంయుక్త మోర్చా, కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ బంద్‌ మండలం ఉల్లి భద్ర జంక్షన్‌ వద్ద రాష్ట్ర రహదారిపై రైతులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు బివి రమణ, కరణం రవీంద్ర తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దాసరి వెంకటనాయుడు, రెడ్డి సూర్యనారాయణ, మిత్తిరెడ్డి శంకర్రావు , రెడ్డి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️