రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

Dec 25,2023 21:33

గుమ్మలక్ష్మీపురం : జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో స్తానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని బర్నికుల కీర్తిక మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైంది. ప్రతిభ చూపిన విద్యార్థినికి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కె.వెంకటనాగేశ్వరావు, కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, వినియోగదారుల జిల్లా అధ్యక్షులు పట్నాయకుని నాగమణి, హెచ్‌ఎం బిడ్డిక భీముడు అభినందించారు.

➡️