రెండు ద్విచక్ర వాహనాల ఢకొీని వ్యక్తి మృతి

Feb 16,2024 21:53

కురుపాం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుంజరాడ జంక్షన్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ప్రకారం సీమల జయశంకర్‌ (41) లేవిడి నుండి తన సొంత గ్రామమైన నీలకంఠాపురం వెళ్తుండగా మొండెంఖల్‌ నుంచి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనంతో ఢకొీంది. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆయన్ను భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి స్థానికులు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే ద్విచక్ర వాహనం వెనుక కూర్చొన్న నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు అడ్డాకులు చామంతికి తీవ్ర గాయాలవ్వడంతో భద్రగిరి సిహెచ్‌సిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వేరే ద్విచక్ర వాహనం వద్ద ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు భద్రగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగించే జయశంకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️