రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Feb 16,2024 21:55

సీతంపేట: మండలంలోని టిటిడి సమీపంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో సవర సిరంగమ్మ(35) తలకు బలమైన గాయమై మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మండ గ్రామానికి చెందిన సవర సిరంగమ్మ భర్త బాలిమ్మతో కలిసి బ్యాంకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై సీతంపేట వస్తుండగా టిటిడి సమీపంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వాహనం అదుపుతప్పింది. దీంతో సిరంగమ్మ జారిపడడంతో తనకు బలమైన గాయమవ్వడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలో మృతి చెందింది. శవ పంచనామా నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎఎస్‌ఐ సంజీవ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

➡️