రోడ్డు మధ్యలో దిగబడిపోయిన లారీ

Feb 22,2024 21:35

కొమరాడ : పార్వతీపురం నుంచి ఒడిస్సా వెళ్లే అంతరాష్ట్ర రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో గురువారం గుమ్మడ గ్రామ సమీపం వద్ద రోడ్డుపై ఏర్పడిన భారీ గోతిలో లారీ దిగుబడిపోయింది. దీంతో సుమారు రెండు గంటల పాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. అధికారులకు చెప్పినా ఫలితం శూన్యమని వాహనదారులు చొరవ తీసుకుని స్థానిక జెసిబి సహాయంతో లారీని బయటకు తీసి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చేశారు. పార్వతీపురం నుంచి కూనేరు వరకు పలు ప్రాంతాల్లో రహదారిపై భారీ గోతులు ఏర్పడడంతో ఎప్పటికప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై ఉన్న గోతులు కప్పాలని అనేకసార్లు సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు చేసినా అధికారులు కనీస పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రోడ్డుపై ఏర్పడిన గోతులను కప్పి ప్రమాదాలను నివారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.మేమే గోతులను పూడ్చుతాం నెలాఖరు నాటికి రోడ్లపై పడిన గోతులను అధికారులు పూడ్చకపోతే తామే పూడ్చుతామని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి తెలిపారు. గురువారం ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రయాణికులతో రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డులో బాగు చేయాలని అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దుర్మార్గమన్నారు.

➡️