విదేశీ విద్యా దీవెన పంపిణీ

Dec 20,2023 19:56

పార్వతీపురం: జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో దీన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ హాజరయ్యారు. గరుగుబిల్లి మండలం ఉద్దవోలుకు చెందిన గంటేడ సత్యసాయి జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికయ్యారు. సత్యసాయి జిఆర్‌ఇలో 340 మార్కులకు 319 మార్కులు, ఐఇఎల్టిఎస్‌ పరీక్షలో 9 పాయింట్ల 7 పాయింట్లు సాధించి పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో సీటు సంపాదించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ. 9,65,540 సహాయం అందించారు. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాల్లో భాగంగా బెలగాంకు చెందిన ఆమిటి హరీష్‌, వీరఘట్టం మండలం హుస్సేన్‌పురానికి చెందిన తాడెల కార్తీక్‌ పొందారు. ఇద్దరు సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా పొందారు. కార్యక్రమంలో సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ పిఒలు కల్పనా కుమారి, సి.విష్ణుచరణ్‌, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్‌, జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిడి కె.శ్రీనివాస రావు, జిల్లా బిసి సంక్షేమ సాధికారిత అధికారి ఎస్‌.కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️