వైసిపి హయాంలో మున్సిపాలిటీలు నిర్వీర్యం

ప్రజాశక్తి-సాలూరు: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో నిధులు లేకుండా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆక్షేపించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా రెండో రోజు బుధవారం నిరసన శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. శిబిరంలో మున్సిపల్‌ కార్మికులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి వేణు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీలనే అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని చెప్పారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగు ణంగా వేతనాలు పెంచా లని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లా యీస్‌ ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్షులు టి.రాముడు, కార్యదర్శి టి.శంకరరావు, శ్రామిక మహిళా కన్వీనర్‌ టి.ఇందు పాల్గొన్నారు.పార్వతీపురం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె రెండో రోజు బుధవారం కొనసాగింది. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో కార్మికులు వినూత్న రీతిలో ఒంటి కాలిపై నిలుచుని నిరసన తెలిపారు. వీరికి అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంటా జ్యోతి, ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, సిఐటియు పట్టణ నాయకురాలు బొత్స లక్ష్మి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో చీపురుపల్లి సింహాచలం, పడాల గాంధీ, మామిడి శివ, బంగారు రాజేషు, గుంట్రెడ్డి గంగయ్యలు, ఇప్పలమ్మ, పాపులమ్మ, పడాల సంతు, వెంకన్న, సాయి, రవి, సత్తిరాజు పాల్గొన్నారు.

➡️