సచివాలయాలు, ఆర్‌బికెలతోనే గ్రామ స్వరాజ్యం

Jan 31,2024 21:27

కురుపాం : సచివాలయాలు, ఆర్‌బికె వ్యవస్థలోనే గ్రామ స్వరజ్యాం వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాంలో రూ.కోటీ 42లక్షలతో నిర్మించిన ఆర్‌బికె కేంద్రం, బియ్యాల వలసలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, కిచ్చాడ సచివాలయం, ఆర్‌బికెలను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు సచివాలjయాలు, రైతులకు ఆర్‌బికె సేవలు నేరుగా గ్రామాల్లో వారి ఇంటి వద్దకే అందిస్తున్నట్టు తెలిపారు. కావున రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తమ ప్రభుత్వాన్నే గెలిపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జడ్పిటిసి జి.సుజాత, స్థానిక సర్పంచులు జి.సుజాత, గవర రాజ్యలక్ష్మి, శెట్టి సురేష్‌కుమార్‌, పువ్వుల ఆజారి, ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, వైసిపి గ్రీవెన్స్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు, మండల కన్వీనర్‌ ఐ.గౌరీ శంకర్‌, అయ్యర్కల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి.విజరు చంద్రశేఖర్‌, ఎంపిటిసి సభ్యులు వి.బంగారనాయుడు, జి.విద్యారాణి, వైసిపి నాయకులు షేక్‌ నూరేళ్ల తదితరులు పాల్గొన్నారు.

➡️