స్పందనకు 167 అర్జీలు

Feb 12,2024 21:42

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 167 అర్జీలు అందాయి. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవ నాయుడుతో కలిసి స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనలో ప్రజలు పెట్టుకునే అర్జీలు రీ ఓపెన్‌ కాకుండా అర్జీదారులతో మాట్లాడి వారికి సరైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.స్పందన ఫిర్యాదులపై తక్షణ చర్యలు పార్వతీపురంరూరల్‌ : సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తులకు సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించాలని ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌ సిబ్బందిని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆయన అర్జీలను స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 8 ఫిర్యాదులను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో ఎస్‌బి సిఐ సిహెచ్‌ లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ సిహెచ్‌.వాసునాయుడు, డిసిఆర్‌బి ఎస్‌ఐ ఫక్రుద్దీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️