హామీలు అమలు చేయాలి

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమగ్రశిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె బుధవారం ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి నాయకులు ఎమ్మెల్యే అలజంగి జోగారావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు చైల్డ్‌ కేర్‌ సెలవులు మంజూరు చేయాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం నిరసన శిబిరం వద్ద ఐద్వా నాయకులు రెడ్డి శ్రీదేవి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంటా జ్యోతి వారికి మద్దతు తెలిపి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్‌ బి.వి.రమణ, నాయకులు పోలినాయుడు, లక్ష్మణరావు, ఈశ్వరరావు, రమేష్‌, భాను ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక సహాయం
కురుపాం : తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష సిబ్బందికి ఉపాధ్యాయులు అండగా నిలిచారు. స్థానిక ఎంఆర్‌సి కార్యాలయం వద్ద ఎంఇఒలు ఎన్‌.సత్యనారాయణ చేతుల మీదుగా కురుపాం మండలంలోని ఉపాధ్యాయులు రూ.1.01 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఎంఇఒ రాధాకృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయులు తోట శంకరరావు, జి.రామగోవింద, యూనియన్‌ నాయకులు బి.కరువులు, చలపతి, జగదీశ్వరరావు, భమిడిపాటి మూర్తి, సంగం నాయుడు, అప్పన్నదొర, వి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️