గుర్తుతెలియని మహిళ మృతదేహం

May 17,2024 21:07

సీతంపేట : మండలంలోని పులిపుట్టి సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు ఎస్సై జగదీష్‌ నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హడ్డుబంగి విఆర్‌ఒ అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. పులిపుట్టి గ్రామం సమీపంలో గల ఎర్రచెరువు దగ్గర ఈ మృతదేహం లభించింది. ఈ మహిళ గురించి ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ, సీతంపేట 6309990883, సిఐ, పాలకొండ 6309990820 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

➡️