ఘనంగా రెవెన్యూ డే వేడుకలు

Jun 20,2024 21:33

పార్వతీపురంరూరల్‌ : స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా రెవెన్యూ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు మాట్లాడుతూ ముందుగా రెవెన్యూ సిబ్బందికి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసారు. రెవిన్యూ శాఖలో పనిచేయడమనేది గర్వపడాల్సిన విషయన్నారు. రెవెన్యూ శాఖ అనేది ఒక వ్యవస్థ అని, ఈ శాఖలో ఎక్కువ మొత్తంలో నవీకరణ విషయాలుంటాయని, ఎప్పటికి అప్పడు ఉద్యోగులు అప్డేట్‌ కావాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. తెలియని విషయాలు నేర్చుకోవడంలో చిన్న, పెద్ద ఉద్యోగి అనే భావన ఉండకూడదని అన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇలా తదితర అంశాల్లో రెవెన్యూ శాఖ ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు ఈస్ట్‌ ఇండియా పాలకులు 1786 జూన్‌ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, ఆ బోర్డు ఏర్పాటైన జూన్‌ 20న రెవెన్యూ డే చేసుకోవడం జరుగుతోందనిచెప్పారు. ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పని నేర్చుకుంటే గుర్తింపు ఉంటుందని, శాఖకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణంగా నేర్చుకోవాలని అన్నారు. శాఖకు ఉన్నట్టువంటి సామర్ధ్యం, శక్తిని ప్రజలకు ఉపయోగపడేలాఉండాలని, ప్రజలకు రెవెన్యూ శాఖపై నమ్మకం ఉండాలని అన్నారు. రెవెన్యూ శాఖపై ఉన్నట్టువంటి ప్రక్షాళన తొలిగించి, రెవెన్యూ శాఖను ఉన్నతి స్థితి, అభివృద్ధికి అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలన్నారు. సమావేశం పాల్గొన్న రెవెన్యూ అధికారులు, విశ్రాంతి రెవెన్యూ అధికారులు, సిబ్బంది అనుభవాలను, వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఎఒవేణుగోపాలరావు, ఈ, ఎఫ్‌, జి -సెక్షన్‌ సూపరింటెండెంట్‌ చిన్నకృష్ణ, డి -సెక్షన్‌ సూపరింటెండెంట్‌ అవాల సూర్యనారాయణ, డిటి చంద్రమౌళి, షేక్‌ ఇబ్రహీం, విఆర్‌ఒ జిల్లా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం.సింహాచలం, విశ్రాంతి రెవెన్యూ అధికారులు మనోరాబారు, సత్యనారాయణ, కామేశ్వరరావు, అప్పలనాయుడు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు సేవలందించడంలో రెవెన్యూ ఉద్యోగులు కీలకం: ఆర్డీవో పాలకొండ : ప్రజలకు సేవలందించడంలో రెవెన్యూశాఖ ఉద్యోగులదే కీలకపాత్ర అని ఆర్‌డిఒ వివి రమణ అన్నారు. రెవెన్యుడే సందర్భంగా గురువారం తుమరాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ శాఖ ద్వారా అమలవుతున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ తహశీల్దార్‌ బుచ్చయ్యను సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ వరహాలు, మండల సర్వేయర్‌ వెంకటరావు తదితరులు ఉన్నారు.సీతానగరం : రెవెన్యూ డే వేడుకలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ కె.శ్రీనివాస్‌ ముందుగా రెవెన్యూ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఉన్నతికి, అభివృద్ధికి అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో విఆర్‌ఒలు కుమార్‌, సాంబ, శ్రీదేవి, సునీల్‌, ఉదరు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.సీతంపేట : మండలంలోని గోయిదిలో రెవెన్యూ దినోత్సవం తహశీల్దార్‌ మహేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ రెవెన్యూ సేవలు గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గీతాంజలి, ఐటిడిపి నియోజకవర్గం కోఆర్డినేటర్‌ ఇమరక పవన్‌, పలువురు ఎంపిటిసి సభ్యులు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.జియ్యమ్మవలస : రెవెన్యూ డే సందర్భంగా ఆ శాఖ ద్వారా ప్రజాప్రయోజనాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్‌ పనితీరు, దాని విశిష్టత మొదలై అంశాలపై గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్‌ సీతారామయ్య వివరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌, జియ్యమ్మవలస గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️