మార్టిన్‌ మరణం పట్ల కలెక్టర్‌ సంతాపం

May 25,2024 20:35

పార్వతీపురంరూరల్‌ : జిల్లా కలెక్టరు డ్రైవరుగా విధులు నిర్వహిస్తూ శుక్రవారం రాత్రి మృతి చెందిన తాలాడ మార్టిన్‌ కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. మార్టిన్‌ గత కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉంటూ చికిత్స పొందుతూ మరణించారు. మార్టిన్‌ మంచి సేవలు అందించారని, వారి సేవలు చిరస్మరణీయమని ఆయన చెప్పారు. భగవంతుడు వారి కుటుంబానికి అండగా ఉండాలని, మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్‌ ఆయన చిత్ర పటానికి జాయింట్‌ కలెక్టర్‌ ఎం ఎస్‌ శోభిక అధికారులు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

➡️