ఎమ్మెల్యే జగదీశ్వరికి అభినందనల వెల్లువ

Jun 5,2024 21:34

గుమ్మలక్ష్మీపురం : తొలిసారి కురుపాం ఎమ్మెల్యేగా గెలుపొందిన తోయక జగదీశ్వరికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు, బంధువులు బుధవారం ఉదయం పెద్దసంఖ్యలో గుమ్మలక్ష్మీపురం వచ్చి అభినందనలు తెలిపారు. ఐదు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. స్వీట్లు తినిపిస్తూ దుస్సాలువాతో సత్కరించారు. మంచి పాలన అందిస్తూ , ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రెస్‌ క్లబ్‌ అభినందనలు కొత్తగా ఎన్నికైన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.శ్రీనివాసరావు, బేత కుమారస్వామి అభినందనలు తెలిపారు. దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు తూలుగు రవికుమార్‌, శంకర్రావు ఉన్నారు.బోనాల విజరు చంద్రకు అభినందనలు వెల్లువ పార్వతీపురం రూరల్‌ : స్థానిక ఎమ్మెల్యేగా గెలుపొందిన బోనెల విజయచంద్రకు అభినందనలు తెలిపేందుకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. బుధవారం ఉదయం వైకెఎం కాలనీలో గల ఆయన నివాసానికి బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాల నుంచి కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, జనసేన, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామాల వారీగా నాయకులు ఆయన్ను కలిసి పుష్పగుఛ్చాలు అందజేసి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల గ్రామాలకు చెందిన సీనియర్‌ నాయకులను సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలు సహకారంతో పార్టీని ముందుకు నడిపి స్తానని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.

➡️