ఏజెన్సీలో సిపిఎం విస్తృత ప్రచారం

Apr 22,2024 21:40

కొమరాడ: ఏజెన్సీలో సిపిఎం అభ్యర్థి మండంగి రమణ విస్తృతంగా ప్రచారం చేశారు. మండలంలోని పాలెం పంచాయతీ రావికోనలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లోని బిన్నిడి, తీలేసు, నయా పంచాయతీకి సంబంధించిన దేరుపాడు, సంకేసు, గుడ్డం, నయా, పూడేసు, పెద్దశాఖ తదితర గ్రామాలకు నేటికీ రోడ్డులేని పరిస్థితి ఉందని అన్నారు. అలాగే అనేక గిరిజన గ్రామాలు తాగునీటికి ఇబ్బందులు పడుతు న్నాయన్నారు. గిరిజన, దళిత, మైనార్టీ, మహిళా, కార్మిక రైతాంగ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. కావున ఈ సమస్యలపై పోరాడుతున్న సిపిఎం అరుకు పార్లమెంటు ఎంపిగా పాచిపెంట అప్పలనరస, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మండంగి రమణ పోటీ చేస్తున్నారు. వీరికి సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే మంగళవారం కురుపాంలో ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేస్తున్న మండంగి రమణకు మద్దతుగా మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ప్రచారంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వాకాడ ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, నాయకులు ఉపేంద్ర, వెంకటేష్‌, నాగభూషణ్‌ పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : ఇండియా బ్లాక్‌ మద్దతుతో కురుపాం నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండంగి రమణ నామినేషన్‌ కార్యక్రమంలో గిరిజనులంతా పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలక అవినాష్‌ కోరారు. మండలంలోని బాసంగి, సంధిగూడ, కె.శివడ, ఎస్‌కె పాడు తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గిరిజనుల పక్షాన ఉండి పోరాడుతున్న సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి రమణకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పువ్వల మోహన్‌రావు, రామస్వామి, సన్యాసిరావు ఉన్నారు. కురుపాం : మండలంలోని భారామణి, గొత్తిలి, కైరాడ గిరిజన గ్రామాల్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.ఈశ్వరరావు సిపిఎం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వద్దకు వెళ్లి సిపిఎం కురుపాం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణకు, అరుకు పార్లమెంట్‌ ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్సకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు వి.వాసుదేవరావు, అంగధ, తదితరులు పాల్గొన్నారు.

➡️