పిహెచ్‌సిని సందర్శించిన డిఐఒ

Apr 21,2024 22:16

కురుపాం : మండలంలోని నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఇమ్మునైజేషన్‌ అధికారి నారాయణరావు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో గల రికార్డులను, నిల్వ ఉన్న మందులను పరిశీలించారు. ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణులకు ఇచ్చే టీకాలను క్రమం తప్పకుండా అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు అభినవ్‌ కూమార్‌, అమరసింహారెడ్డి, వైద్య సిబ్బంది శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.

➡️