ఆదివాసీలపై అంతులేని నిర్లక్ష్యం

Apr 5,2024 21:40

 కురుపాం : ఏజెన్సీలో గిరిజనుల సమగ్రాభివృద్ధి అందని ద్రాక్షగానే మిగిలింది. ఏళ్ల తరబడి గిరోడ్డు రవాణా, తాగునీరు, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు అందని ద్రాక్షగా ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో గిరిజనులు వెనుకబడే ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపడకపోవడం వల్ల చావు బతుకుల మధ్య జీవన మనుగడ సాగిస్తున్నారు. గెడ్డలు, వాగులు దాటి కొండలు ఎక్కి డోలిమోతలతో వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నేటికీ ఉంది. తరతరాలుగా సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని పెదగొత్తిలి పంచాయతీలో గల నాగార కుంటుబాయిలో 36 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామానికి ప్రధాన రహదారికి మధ్య మూడు కిలోమీటర్ల దూరం ఉంది. సరైన రహదారి సౌకర్యం, వంతెన లేక అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైతే డోలిమోతే వారికి గతి. ఇక్కడ 120 మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. నిత్యావసర వస్తువులు, డిపో నుంచి రేషన్‌ తెచ్చుకోవాలంటే గెడ్డ దాటి వెళ్లాల్సిందేనని ఆ గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గెడ్డలో నీరు అధికంగా చేరడంతో ఏ క్షణం ఏమవుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆ గెడ్డలో ముగ్గురు గల్లంతయ్యారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే 108 వాహనం గ్రామానికి రాలేని పరిస్థితి నెలకొందని, సుమారు 2 కిలోమీటర్ల దూరం డోలితో మోసుకొని గెడ్డ దాటాల్సి పరిస్థితి వస్తుందని తెలిపారు. అలాగే తమ పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే భుజాన మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ ఇబ్బందులను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమను పట్టించుకునే నాధుడేలేడని, తమ బాధల్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని అక్కడ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి నాగరకుంటుబాయికి రహదారి వేసి, వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.సమస్యల వలయంలో మా గ్రామం పెదగొత్తిలి పంచాయతీలో గల నాగార కుంటుబాయి గిరిజన గ్రామం మాది దశాబ్దాల కాలం నుంచి 36 గిరిజన కుటుంబాలు 120 మంది ప్రజలు జీవిస్తున్నాం. మా గ్రామానికి రహదారి సౌకర్యం, వంతెన లేక అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైతే డోలిమోతే గత అవుతుంది వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడిన సందర్భంలో ఆరోగ్యం బాగోలేని వారిని గెడ్డ దాటించలేక ప్రాణాలు విడిచే సంఘటన ఎన్నో జరిగాయి. నిత్యావసర వస్తువులు, డిపో నుంచి రేషన్‌ తెచ్చుకోవాలన్న మధ్యలో ఉన్న గెడ్డ దాటి వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు సమస్యలతో జీవనం సాగిస్తున్నాం.తిమ్మక బాలరాజు,నాగర కుంటుబాయిహామీలే తప్ప ని అమలకు నోచుకోని పరిస్థితిఎన్నికల ముందు అన్ని పార్టీలు, నాయకులు రావడం ఎన్నికల అనంతరం గెడ్డ వద్ద వంతెన, రహదారి మంజూరు చేయిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప అమలుకు నోచుకునే పరిస్థితి దశాబ్దాల కాలం నుం లేదు. నేను స్వయంగా ఆ గ్రామ ప్రజలను తీసుకుని ఐటిడిఉ అధికారులకు వద్దకు వెళ్ళి ఎన్నోసార్లు వినతులు అందిం చాం. కానీ అధికారులు కూడా స్పందించే దాఖలాల్లేవు. తమ ఇబ్బందులను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు. అంటే గిరిజన సమస్యలు వారికి అంతు పట్టవు. ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన గిరిజనం తలరాతలు ఎప్పటికీ మారవు.టి.లోకనాదంసర్పంచ్‌ పెద గొత్తిలి పంచాయతీ.

➡️