రైతులు లాభదాయక విధానాలు అనుసరించాలి

Jun 14,2024 21:50

పార్వతీపురంరూరల్‌: రైతులు లాభదాయక విధానాలను అనుసరించాలని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.వెంకటరావు అన్నారు. మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో డోకిశీలలో రైతు న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు సంబంధిత చట్టాలపై అవగాహన పొందాలన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు సమయంలో నాణ్యత చూడాలని, సంబంధిత బిల్లులు జాగ్రత్తపర్చాలని ఆయన సూచించారు. మోసాలకు గురైనప్పుడు చట్టాలకు అనుగుణంగా నష్టపరిహారం పొందవచ్చని చెప్పారు. రోజువారీ జీవనంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చట్టపరంగా న్యాయం పొందవచ్చని ఆయన అన్నారు. మండల న్యాయ సేవా కమిటి న్యాయ సహాయం ఉచితంగా అందిస్తుందని ఆయన చెప్పారు. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సత్కరించారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్‌ కమిటీ సభ్యులు టి.జోగారావు, ఐటిడిఎ పిఎఒ జి.శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి ఎం.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️