బైకులు ఢకొీని నలుగురికి తీవ్ర గాయాలు

May 24,2024 21:47

గుమ్మలక్ష్మీపురం:  మండలంలోని ఇరిడి జంక్షన్‌ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు బలంగా ఢకొీడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుమ్మలక్ష్మీపురం నుంచి తాడికొండ వెళ్తున్న పత్తిక నాగేశ్వరరావు, కిల్లక సంతోష్‌ కోసింగి భద్ర నుంచి మురడ వెళ్తున్న కిల్లక మురళి, కిల్లక అమల బైకును ఢకొీనడంతో తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఉన్నత వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎల్విన్‌ పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️