మలేరియాతో బాలిక మృతి

May 25,2024 20:48

సాలూరు : మండలంలోని డెన్సరాయిలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో అధిక సంఖ్యలో జ్వరపీడితులు బాధపడుతున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా వుండడం, వర్షాలు పడుతుండడంతో గ్రామంలో మలేరియా విజృంభించింది. దీంతో గ్రామానికి మర్రి దివ్య అనే ఎనిమిదేళ్ళ గిరిజన బాలిక శుక్రవారం మతి చెందింది. దివ్య మూడో తరగతి చదువుతోంది. మర్రి కాంగు కుమార్తె దివ్యకు జ్వరం రావడంతో సాలూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొద్దిరోజులు చికిత్స పొంది తీసుకెళ్లిపోయారు. కాంగు కుమారుడు విజరు కూడా మలేరియాతో బాధపడుతూ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో ఇంటికొక జ్వరపీడితుడు వున్నట్లు తెలుస్తోంది. వెంటనే వైద్యాధికారులు గ్రామం వైద్య శిబిరం నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️