స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా హిజ్రా నామినేషన్‌

Apr 22,2024 21:56

కురుపాం : నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా హిజ్రా అడ్డాకుల గీతారాణి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కురుపాంలో తను నివాసం ఉంటున్న గాంధీనగర్‌ వీధి నుండి నియోజకవర్గంలో గల ఐదు మండలాల హిజ్రాలతో కలిసి తహిసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వివి రమణకు తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము కూడా అన్ని రంగాల్లో సమానమైమని, అటువంటిది రాజకీయాల్లో కూడా హిజ్రాలుండాలని అటువంటిప్పుడే సమాజంలో తమకు కూడా గుర్తింపు ఉంటుందని అందుకే రాజకీయాల్లోకి రావడం జరిగిందని అన్నారు.

➡️