నేను పోటీకి “సిద్దం”

Mar 13,2024 12:28 #Manyam District
  • ఆదివాసీ యువత భవిష్యత్తు కోసం 
  • హిజ్రాలు సంఘం నాయకులు గీతారాణి 

ప్రజాశక్తి-కురుపాం: కురుపాం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఏర్పాటైన నుంచి నేటివరకు ఎందరో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో రహదారి, త్రాగు నీరు, ఇతర మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయని కురుపాం నియోజకవర్గంలో శతశాతం అభివృద్ధి కోసం, ఆదివాసీ యువత భవిష్యత్తు కోసం తాను ఈధఫా 2024సాదారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హిజ్రాలు సంఘం నాయకులు అడ్డాకుల గీతా రాణి అలియాస్ ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో ఆదివాసీ యువత ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటాన్ని తాను గుర్తించానని అన్నారు. శారీరక వైకల్యం ఉన్న తాను ఎన్నో రకాల ఇబ్బందులు పడి తన లాంటి వారు ఇబ్బందులు పడకూడదని భావించీ హిజ్రాలు సంఘం ఏర్పాటు చేసి దానిని జిల్లా, రాష్ట్ర స్థాయి సంఘాలు ప్రతినిధులతో అనుసంధానం చేసి అనేక సంక్షేమ పథకాలను, ఉపాధి శిక్షణలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పేరుకే ఎస్టీ రిజర్వుడు అయినా కేవలం మూడు సార్లు మాత్రమే గిరిజనులు ఎమ్మెల్యేగా పనిచేసారని మిగిలిన కాలం పెత్తందార్లు ఎమ్మెల్యేగా, మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కారణంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి శతశాతం జరుగలేదని, ఇప్పటికీ సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణీలు, నవజాత శిశువు మరణాలు కోకొల్లలు, ఏటా గిరిజన సంక్షేమ విద్యార్థులు పదుల సంఖ్యలో మ్రృత్యువాత పడుతున్నారు. ఉపాధి అవకాశాలు స్థానికంగా లేక పట్టణాలు కు వలసలు వెళ్లి పోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు లో ఖచ్చితత్వం లేకపోవడం, తాయిలాలు లొంగిపోయి సామూహిక హక్కులు కోల్పోయోందుకు మరో కారణం అని అన్నారు. ఆదివాసీ మహిళలు, యువత , నాయకులలో చైతన్యం నింపేందుకు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్దంగా ఉన్నానని తెలిపారు. డిగ్రీ సిఎం పూర్తి చేసి హిజ్రాలు సంక్షేమం కోసం చేసిన అనేక కార్యక్రమాలను గుర్తించి వివిధ సంస్థలు అవార్డులను ప్రధానం చేసారని అన్నారు. కురుపాం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ కులం జాతాపులో పుట్టిన తనకు ఐదు మండలాల్లో సత్సంబంధాలు ఉన్నాయని, అలాగే వేలాది మంది స్నేహితులు, హిజ్రాలు మద్దతు సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తే పార్టీ తరపున లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

➡️