టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా జగదీశ్వరి నామినేషన్‌

Apr 22,2024 21:55

కురుపాం : కురుపాం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తోయిక జగదీశ్వరి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కోట దుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేశ్‌ చంద్ర దేవ్‌, టిడిపి, జనసేన, బిజెపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్‌ పత్రాలు ఎన్నికల అధికారి వివి రమణకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన బాబు షఉరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్‌ సిక్స్‌ పథకాలే టిడిపి గెలుపునకు నాందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు దత్తి లక్ష్మణరావు, డొంకాడ రామకృష్ణ, కోలా రంజిత్‌ కుమార్‌, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కె. మల్లేశ్వరరావు , టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️