ఉద్యమలే కొరటాలకు ఘనమైన నివాళి

Jul 1,2024 20:57

పార్వతీపురంటౌన్‌: కార్మిక, కర్షక పోరాటాలు, ఉద్యమాలకు కొరటాల సత్యనారాయణ జీవిత చరిత్ర ఉద్యమాలకు స్ఫూర్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుబ్బారావమ్మ అన్నారు. కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతి సందర్బంగా సోమవారం స్థానిక సుందరయ్య భవనంలో ఆయన చిత్రపటానికి సుబ్బరావమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పూలమాల వేసి నివాలర్పించారు. ఈ సందర్బంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ ఆంధ్ర కమ్యూనిస్ట్‌ ఉద్యమ నేతలలో ప్రముఖుడని, సిపిఎం పాలిట్‌బ్యూరో సభ్యుడిగా తన శైలిలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిర్బంధాలను లెక్క చేయకుండా రైతాంగం పెద్ద ఎత్తున చారిత్రాత్మక ఉద్యమం నిర్వహించిందని, దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదని తెలిపారు. వెనుకబడ్డ ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, లక్షలాది మంది కౌలురైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని పత్తి, మిరప, చెరుకు, పొగాకు వంటి వ్యాపార పంటలు పండించే రైతులు మార్కెట్‌ ఒడిదుడుకులకు తీవ్రంగా నష్టపోతున్నారని, మన్యం జిల్లాలో ధాన్యం రైతులు ప్రభత్వం నుండి వందల కోట్ల రూపాయలు బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శివ్వాంలో భూస్వాములు దళితులపై చేసిన దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించి, దళితులకు అండగా, భూస్వాములకు ఎదురు నిలిచిందని, అటువంటి పోరాటాల స్ఫూర్తితో కొరటాలకు అర్పించే నిజమైన నివాళని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.మన్మధరావు, వి.ఇందిర, పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, నాయకులు గంట జ్యోతి, పి.రాము తదితరులు పాల్గొన్నారు.

➡️