సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత

May 22,2024 21:33

రామభద్రపురం: ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఉపాధి హామీ జిల్లా అంబుడ్స్‌మెన్‌ శతపతి అన్నపూర్ణ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో క్షేత్ర, సాంకేతిక సహాయకులు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి కొత్త పనులు మంజూరుతోపాటు ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు కచ్చితంగా వంద పని దినాలు ఉండేటట్లు ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. పని ప్రదేశాల్లో మంచినీటి సరఫరా, వైద్య సౌకర్యాలు కల్పిస్తూ నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మస్టర్లు వేసేటప్పుడు క్షేత్ర సహాయకులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది, ఎంపిడిఒ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సమావేశానికి ముందు గజపతినగరం క్లష్టర్‌ ఎపిడి జనార్దనరావుతో కలిసి ఎపిఒ త్రినాథరావు దుప్పులపూడి, ఇట్లమామిడిపల్లి గ్రామాల్లో పనులను, మస్టర్లను పరిశీలించారు. సమావేశంలో సాంకేతిక సహాయకులు శ్రీను, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️