అర్ధాంతరంగా నిలిచిన ఆస్పత్రి పనులు

Apr 21,2024 22:15

సీతంపేట : స్థానిక ఏరియా ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. 30 పడకల నుంచి వంద పడకల ఏరియా ఆసుపత్రిగా 2020 లో అప్‌ గ్రేడ్‌ చేసి రూ.19.7 కోట్లు మంజూరైనప్పటికీ పనులు సకాలంలో పూర్తి కాక మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఆస్పుత్రికి వచ్చే రోగులకు, ఇటు విధులు వైద్యులకు అవస్థలు తప్పడంలేదు. ఈ ఏరియా ఆసుపత్రికి సీతంపేట, భామిని, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, హిరమండలం, ఒడిస్సాలోని ప్రజలకు ఈ ఆ స్పత్రి పెద్దదిక్కు. ఈ ఆసుపత్రికి రోజుకు 250 నుంచి 300 పైగా రోగులు చికిత్స కోసం వస్తుంటారు. సోమ, బుధ, శుక్రవారం శుక్రవారం రోజుల్లో 300 నుంచి 350 వరకు ఒపి పెరుగుతుంది. ఇంతటి ప్రాధ్యాత గల ఆసుపత్రి నిర్మాణంపై అధికారులు, పాలకుల నిర్లక్షం చూపడం ఎంత వరకు సమజంసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏరియా ఆసుపత్రిలో 23 మంది వైద్య నిపుణులు ఉన్నప్పటికీ వారు రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలందించేందుకు మౌలిక సౌకర్యాలు శూన్యం. వసతి సౌకర్యాల్లేకపోవడంతో ఒక్కొక్క ఇరుకు గదిలో నలుగురు వైద్యులు రోగులను పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టరు ఒప్పందంగా ప్రకారం 15నెలల్లో నిర్మించి అప్పగించాలి. అయితే రూ.19.7కోట్లు గానూ జిఎస్‌టి, అన్ని పన్నులూ పోనూ రూ.13.30కోట్లు మంజూరు చేశారు. న్యూ బ్లాక్‌, ఎజిస్టింగ్‌ బ్లాక్‌., సెకండ్‌ ఫ్లోర్‌, బయో వేస్ట్‌, మార్చురీ, సివరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌, ప్రత్యేకంగా విద్యుత్‌ ట్రాన్స్ఫారం నిర్మించాల్సి ఉంది. వీటిలో మొదటి విడతలో రూ.7 కోట్లు విడుదల చేయగా ఎగ్జిస్టింగ్‌ బ్లాక్‌, ఒపి బ్లాక్‌ పూర్తి చేశారు. కరెంటు, వాటర్‌ సదుపాయం కల్పించారు. ఐపి బ్లాక్‌ 90 శాతం పనులు పూర్తి చేశారు. కాంట్రాక్టులు చేసిన పనికి ఇంకా రూ.కోటి 80 లక్షలు మాత్రమే చెల్లించాలి చెల్లించాల్సి ఉంది. ఇంకా 6.30కోట్లకు ట్రాన్స్ఫారం మార్చి బ్లాక్‌ బయో వేస్ట్‌ తదితర పనులు చేయాల్సి ఉంది. ప్రధానమైన సమస్యలు రాంపు ఎత్తు కనెక్టింగ్‌ శ్లాబ్‌ పనులు పూర్తిగా కాకపోవడంతో రోగులు, వైద్యులు పైకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి బ్లాక్‌ పనులు పూర్తి కాకపోవడంతో 35 పడకలు కొత్తవి ఉన్నప్పటికీ ఇంకా ప్రారంభించలేదు. ఉన్న 54 పడకలు. గదుల్లో ఉండగా మిగతావి వారండాలో వేస్తూ రోగులకు వైద్యమందిస్తూ నెట్టుకొస్తున్నారు. అంతేకాకుండా ట్రాన్సాఫార్మర్‌ ప్రత్యేకంగా లేకపోవడంతో ఎప్పటికప్పుడు విద్యుత్‌ సమస్య వెంటాడుతుంది. ప్రస్తుతం ఎండలు భగభగ మండుతున్నాయి. ఉష్ణోగ్రత అధిక డిగ్రీలు పెరగడంతో ప్రజలు రోగాల బారినపడి ఆస్పత్రికి రోగుల తాకిడి పెరగనుంది. అంతేకాకుండా వర్షాలు ప్రారంభమై సీజనల్‌ జ్వరాలు ప్రారంభమైతే రోగుల సంఖ్య మరింత అత్యధికంగా పెరగనుంది. అప్పటికీ భవనాల పనులు పూర్తి చేయకపోతే రోగులకు, వైద్యులకు కష్టాలు తప్పవు. కావున ఏరియా ఆసుపత్రి పనులు వెంటనే పూర్తి చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.బిల్లులు చెల్లించకే పనులు నిలిచిపోయాయిఏరియా ఆస్పత్రి పనులు నిలిచిపోవడంపై ఎపిఎంఐఎస్‌ఐడిసి డిఇ సిమ్మన్న, ఎఇ ఇంద్రసేనను ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా, గుత్తాదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశారని తెలిపారు.

➡️