చంద్రబాబునాయుడ్ని కలిసిన విజయచంద్ర

Jun 6,2024 21:24

పార్వతీపురంరూరల్‌ : స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును గురువారం అమరావతిలో కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ఆయన చంద్రబాబును, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కలిసి అభినందనలు తెలిపారు.లోకేష్‌ను కలిసిన సంధ్యారాణి సాలూరు : జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను, గురువారం ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ఆమె అమరావతిలో లోకేష్‌ను, టిడిపి అధినేత చంద్రబాబునాయుడునుకలిశారు. రెండు దశాబ్దాల తర్వాత నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి అఖండ విజయం సాధించారు. ఈనెల 12న చంద్రబాబు నాయుడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్టీ కేటగిరీ నుంచి మన్యం జిల్లాలో సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీగా అనుభవం ఉన్న సంధ్యారాణి కి కేబినెట్‌లో చోటు దక్కవచ్చుననే చర్చ జరుగుతోంది. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

➡️