పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారులతో సమావేశం

Mar 21,2024 15:23

– రిటర్నింగ్‌ అధికారి వికాస్‌ మర్మత్‌ ఐ.ఏ.యస్‌.

ప్రజాశక్తి -నెల్లూరు : నెల్లూరు సిటీ 117 అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి వికాస్‌ మర్మత్‌ బుధవారం నోడల్‌ అధికారులతో జరిగిన సమావేశంలో కొన్ని సూచనలు చేశారు. ఈరోజు నెల్లూరు నగరంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ విభాగంలో సమావేశం నిర్వహించి రాబోయే ఎలక్షన్స్‌ గురించి ముందస్తు కార్యాచరణ గురించి ఆయన వివరించారు. పోలింగ్‌ రోజు ఓటు వేయలేని వికలాంగులు, వయో వఅద్ధులు ఏ ఒక్కరూ కూడా వారి ఓటు హక్కు కోల్పోకుండా.. కచ్చితంగా వినియోగించుకునేలా ఎలక్షన్‌ సిబ్బంది సదుపాయాలు చేయాలని వికాస్‌ ఈ సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారులు డ్వామా పీ.డీ డి. వెంకట్రావు, తిరుపతయ్య, ఏ.ఆర్‌.ఓ.శర్మద, ఏ.ఈ.ఆర్‌.ఓ.వెంకటేశ్వర రావు, టీ.పి.ఆర్‌.ఓ.ప్రసాద్‌, ఆర్‌. ఓ.డీ.టీ.మాధవి, వై.నాగేశ్వరావు హాజరైనారు.

➡️