అభివృద్ధిలో సహకరిస్తా: ఎంఎం కొండయ్య

ప్రజాశక్తి-వేటపాలెం: అభివృద్ధిలో సహకరిస్తానే గాని ప్రజలతో వ్యాపారం చేసే అలవాటు తనకు లేదని టిడిపి కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్యవైశ్య గుంట కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ వలన వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని అన్నారు. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల వ్యాపారాలు నిరాటకంగా కొనసాగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేటపాలెం రైల్వేస్టేషన్‌ శ్మశానవాటికకు వెళ్లే దారులను, డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొగ్గుల పార్థసారథి, నాసిక వీరభద్రయ్య, పొగడదండ వెంకటేశ్వర్లు, సజ్జ వెంకటేశ్వరరావు, దోగుబత్తి బాలకృష్ణ, కూటుకూరి కోటిస్వామి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

➡️