కడపలో సినీ నటి నిధి అగర్వాల్‌ సందడి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కడప నగరంలో సినీనటి, ప్రముఖ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సందడి చేశారు. కడప ఎమ్మెల్యే మాధవితో కలిసి జోస్‌ ఆలుక్కాస్‌ నగల షోరూమ్‌ను ప్రారంభించారు. ఆర్‌టిసి బస్టాండ్‌ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జోష్‌ ఆలుక్కాస్‌ బంగారు, వజ్రాల షోరూమ్‌ను శనివారం కడప ఎమ్మెల్యే మాధవి, సినీనటి నిధి అగర్వాల్‌ ప్రారంభించారు. సినీ నటిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున షో రూమ్‌ వద్దకు చేరుకున్నారు. అభిమానులను ఆమె ఆప్యాయతగా పలకరించారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. బంగారు, వజ్రా భరణాలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ కడపలో కార్పొరేట్‌ షో రూములు రావడం సంతోషంగా ఉందన్నారు. వ్యాపారం అభివద్ధి చెంది మరిన్ని షోరూమ్‌ లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. సినీనటి మాట్లాడుతూ మొదటిసారి కడపకు వచ్చానని తెలిపారు. ప్రజల ఆదరణ మరువలేనని పేర్కొన్నారు. నాణ్యతకు, మన్నికకు పెట్టింది పేరు జోస్‌ ఆలుక్కాస్‌ అని తెలిపారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ వర్గీస్‌ ఆలుక్కా, పాల్‌ ఆలుక్కా, జాన్‌ ఆలుక్కాస్‌ మాట్లాడుతూ షోరూం ప్రారంభం సందర్భంగా రూ.60 వేలు విలువ గల బంగారు ఆభరణాలు వజ్రాల కొనుగోలుపై బంగారు నాణ్యాన్ని అందుకుంటారని, వజ్రాలపై 20 శాతం, ప్లాటినం ఆభరణాలపై ఏడు శాతం తగ్గింపు వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 50శాతం తగ్గింపు కూడా ఉందని పేర్కొన్నారు. వివాహ కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తాయని తెలిపారు. పాత బంగారానికి ఎక్సై చేంజ్‌ చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో తన ఉనికిని పటిష్టం చేసుకుంటుందని చెప్పారు.

➡️