బీబీ నాంచారమ్మను దర్శించుకున్న ముస్లిములు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వస్వామి ఆలయం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతీ ఏడాది ఉగాది పండుగరోజుముస్లిములు బీబీ నాంచారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తుంది. మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా ముస్లిములు ఆడపడుచు బీబీ నాంచారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. కులమతాలకు ఆతీతంగా ఇక్కడ స్వామి, బీబీ నాంచారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. బియ్యం, బేడలు, బత్యం చెల్లిస్తారు. హిందువులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

➡️