ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్‌ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Dec 4,2023 23:00

ప్రజాశక్తి-జగ్గయ్యపేట

ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా 50వ మహాసభ జగ్గయ్యపేట పట్టణంలోని ఎస్‌జిఎస్‌ కళాశాలలో ఈ నెల 2, 3 తేదీల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మందితో నూతన కమిటీని ఎనుకున్నారు. మహాసభలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించినట్లు రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ తెలిపారు. సంక్షేమ హాస్టల్స్‌కు సొంత భవనాలు నిర్మించాలని, మెస్‌ కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచాలని, జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, జగ్గయ్యపేట, విజయవాడ కేంద్రంగా ప్రభుత్వ పీజీ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని, నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల, ప్రతి మండలానికి జూనియర్‌ కళాశాల, పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ, జాతీయ విద్యా విధానం రద్దు తదితర తీర్మానాలను మహాసభ ఆమోదించింది. ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శిగా చిమట వెంకటేశ్వరరావు, అధ్యక్షులుగా గుగులోతు గోపినాయక్‌, ఉపాధ్యక్షులుగా ఎస్‌కె జాహిదా, ఎం.కుమార్‌నాయక్‌, టి.కుమార్‌స్వామి, సహాయ కార్యదర్శులుగా బి.మాధవ్‌, బి.యమున, ఎం.చరణ్‌, వై.కమల్‌ కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులుగా వై.చిన్నారి, సంతోష్‌, పి.ఈశ్వర్‌, ఎం.రాణి, వి.అజరు కుమార్‌, జి.రమ్య, బి.రాము, ఎం.గోపీ, సిహెచ్‌.మోహన్‌కృష్ణ, కె.ప్రదీప్‌, వై.కార్తీక్‌లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సోమేశ్వరరావు, ప్రణీత, మండల నాయకులు ప్రణరు, మహిళ సంఘం నాయకులు నాగమణి పాల్గొన్నారు.

➡️