కృష్ణా తరంగ్‌లో ‘సిద్థార్థ’ విద్యార్థినుల ప్రతిభ

Dec 4,2023 22:59

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణా తరంగ్‌ – 2023 యువజనోత్సవాలలో నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థినలు పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరచి పతకాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.కల్పన తెలిపారు. ప్రతిభ కనపరచిన విద్యార్థులను సోమవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ కల్చరల్‌ విభాగం క్లాసికల్‌ సోలో పోటీలో ఎం.వి. సాయి వైష్ణవి, లైట్‌ వోక్‌ పోటీలో ఎం.వి. శ్రీ వైష్‌ణవి, క్లాసికల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌లో డి.మహాలక్ష్మి పతకాలు సాధించారని తెలిపారు. గ్రూప్‌ సాంగ్‌, ఫోక్‌ ఆర్క్రెస్ట్రా ఫోక్‌ డ్యాన్స్‌ పోటీలలో తమ కళాశాల విద్యార్థినులు ద్వితీయ బహుమతులు సాధించారని తెలిపారు. లిటరసీ విభాగం నుండి ఎ.ఎం. సంకీర్తన ప్రథమ బహుమతి సాధించిందని తెలిపారు. ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం నుండి బి.శివ లాస్య , కార్టూనింగ్‌లో ప్రథమ బహుమతి సాధించిందన్నారు. అలాగే ఎం.సాయి వైభవి, క్లే మోడలింగ్‌లో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈపోటీలలో తమ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరచి సెకండ్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించినట్లు తెలిపారు. ఈసందర్భంగా కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయ కర్త డాక్టర్‌ ఎం.సరళాదేవి, కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ టి. విజయలక్ష్మి విద్యార్థులను అభినందించారు.

➡️