సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ

Dec 4,2023 22:59

ప్రజాశక్తి-వన్‌టౌన్‌

స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో 40,46,51 డివిజన్లలో సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్నికి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి సచివాలయంలో అమర్చిన పేదలకు చేకురిన లబ్దిని వివరించే బోర్డును ఆవిష్కరించి సచివాలయం పరిదిలో ఏర్పాటు చేసిన జండా దిమ్మను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పెద్దలతో ముఖ ముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలనే తీర్పు చెప్పమని కోరుతున్నాం ప్రజలు చక్కటి స్పందన ఇస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు పరచని వ్యక్తి అని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జగనన్న సంక్షేమం అభివద్ది కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. ప్రజలకు మంచి చేసిన వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ యరడ్ల అంజనేయ రెడ్డి, 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపిళ్ళ రాజేష్‌, మనోజ్‌ కొఠారి, గౌస్‌ మొహిద్దిన్‌, యశోధర్‌, కేసరి కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️