20, 21 తేదీలలో నగరంలో

May 17,2024 21:30

సూత్రా సమ్మర్‌ స్పెషల్‌ ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సూత్రా ఎగ్జిబిషన్‌ ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో విస్తృత శ్రేణిలో సమ్మర్‌ స్పెషల్‌ దుస్తుల ప్రదర్శన, అమ్మ కాలు విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మే నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె.ప్రసాద్‌ తెలిపారు. సూత్రా ఎగ్జిబిషన్‌లో దుస్తులు, గౌన్లు, చీరలు, గృహ అలంకరణ వస్తువులు, కాస్మెటిక్స్‌, పాదరక్షలు, ఉపకరణాలు వగైరా మరెన్నో విభిన్న డిజైనర్‌ ఉత్పత్తులను ప్రదర్శిస్తామన్నారు. భారతదేశం అంతటా ఉన్న ప్రతిభావంతులైన భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు తమ డిజైన్లను ప్రీమియం కస్టమర్లకు ప్రదర్శించడానికి సూత్రా ఒక వేదిక అని అన్నారు. ఈ ప్రదర్శనలో మహిళల ఎత్నిక్‌ వేర్‌, వేడుకలకు ధరించేవి, సంప్రదాయ దుస్తులు, వివాహాలకు కావలసినవి మొదలైనవి లభిస్తాయన్నారు. వార్డ్‌ రోబ్‌, ఎలిగేంట్‌ స్టోర్‌ డిల్లీహాట్‌, అపురూప, జైపూర్‌ వరల్డ్‌, వి-స్టూడియోస్‌- రాజస్థాన్‌, పెహచాన్‌, లష్‌, సిక్వియా క్లాతింగ్‌, రైన్స్‌-జైపూర్‌, నూర్‌ హేండ్‌ లూం శారీ-చందేరి, లాల్‌ గలియారా వంటి అనేక డిజైనర్‌ ఉత్పత్తుల సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంట్టున్నాయని చెప్పారు.

➡️