జోరుగా అభ్యర్థుల ప్రచారాల హోరు

Apr 29,2024 22:15
  • రెడ్డిగూడెంలో టిడిపి ప్రచారం

ప్రజాశక్తి – రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల కేంద్రంలో రాఘవాపురం, రెడ్డిగూడెం సెంటర్‌లో టీడీపీ మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాదు, పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాధ్‌ విజయం కోసం వసంత శిరీష, సాయి ధీమంత్‌ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, యువ నాయకులు బొమ్మిన కోటేశ్వరరావు, చాట్ల చందా, సుబ్బారెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి అభ్యర్థి సర్నాల తిరుపతిరావు విజయం కోసం జెడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయ భాస్కర్‌ రెడ్డి మద్దులపర్వ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలంకి సురేష్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామినేని కుటుంబం ప్రచారంజగ్గయ్యపేట: పట్టణంలోని ఆదివారం రాత్రి విలియంపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను చేసిన అభివద్ధిని తెలియపరుస్తూ ఉదయభాను సోదరీమణులు జయశ్రీ, బేబీ, వారి కుమార్తె పద్మ ప్రియాంక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా సామినేని ఉదయభానుని ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. పట్టణంలోని 3వ వార్డు వెంకటగిరి గుట్ట ప్రాంతంలో ఉదయభాను సతీమణి సామినేని విమలభాను, వారి సోదరీమణులు జయశ్రీ, బేబీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విమలభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమం, జగ్గయ్యపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీగా కేసినేని నానిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా సామినేని ఉదయభానుని గెలిపించాలని ప్రజలను కోరారు.ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి ప్రజాశకి – జగ్గయ్యపేట: మండలంలోని బూదవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులతో జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపించి అనంతరం విజయవాడ పార్లమెంట్‌ టిడిపి ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాధ్‌ (చిన్ని)ని, జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు (శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య) సైకిల్‌ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.వైసిపి అభ్యర్థి సామినేని ప్రచారంప్రజాశక్తి – జగ్గయ్యపేట: ఎనడూ లేనివిధంగా జగ్గయ్యపేట పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం కాబట్టే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఓటు అడిగే హక్కు తమకుందని ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. పట్టణంలోని 22వ వార్డ్‌ డంగుమిల్లు సమీపంలో సామినేని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కేశినేనిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందించారని అన్నారు. నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేశానని తెలిపారు. అభివృధ్ధికి పట్టం కట్టండిప్రజాశక్తి – కంచికచర్ల : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అభివృధ్ధికి పట్టం కట్టాలని నందిగామ వైసిపి అభ్యర్ధి, సిట్టింగ్‌ ఎమ్మల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌ రావు విజ్ఞప్తి చేశారు. స్థానిక అంబేద్కర్‌ కాలనీలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గడచిన 5 ఏళ్ల కాలంలో వైసిపి ప్రభుత్వం అమలు చేసిన అభివృధ్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ, మరోసారి గెలిపించి అవకాశం ఇస్తే నందిగామ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. 20 ఏళ్లలో ఏ ప్రభుత్వంలో చేయని అభివృధ్ధి 5 ఏళ్ల జగన్మోహన్‌ రెడ్డి పాలనలో చిత్తశుధ్ధితో పనిచేసి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలు మరింత పారదర్శకంగా అమలు కావాలంటే జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలని కోరారు.ఇండియా వేదిక ఎంఎల్‌ఎ, ఎంపి అభ్యర్థులు కర్నాటి అప్పారావు, వల్లూరు భార్గవ్‌ పిలుపుప్రజాశక్తి – జగ్గయ్యపేట : బిజెపిని బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి ఇండియా వేదిక ఎమ్మెల్యే, ఎంపి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇండియా వేదిక ఎమ్మెల్యే అభ్యర్థి కర్నాటి అప్పారావు, ఎంపి అభ్యర్థి వల్లూరు భార్గవ్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని సోమవారం ఇండియా వేదిక ఆధ్వర్యంలో చెరువు బజార్‌ ముక్త్యాల రోడ్‌, బస్టాండ్‌ కూడలి, బలుసుపాడు రోడ్‌, చెరువు బజార్‌లలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్‌ కూడలిలో అభ్యర్థులు మాట్లాడుతూ దేశంలో కులాన్ని, మతాన్ని విడదీసి పాలించింది బిజెపి ప్రభుత్వం అని, దేశంలో ఏమైనా డ్యాంలను నిర్మించారా దేవుడు ఫోటోలు పెట్టి ఓట్లు అడిగే దుస్థితికి బిజెపి దిగజారిందని విమర్శించారు. సిపిఎం జిల్లా నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించి, ఇండియా కూటమి బలపరిచిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో జగ్గయ్యపేట సిపిఎం మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి, వత్సవాయి మండల కార్యదర్శి తమ్మినేని రమేష్‌, సిపిఎం నాయకులు ఫేక్‌ గౌస్‌మియా, మండేపూడి చంద్రశేఖర్‌, రావెళ్ల శేషు, కోట రవికుమార్‌, పటేల్‌, సిపిఐ నియోజకవర్గ ఇన్చార్జి అంబాజీ శివాజీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దాచేపల్లి వీరభద్రరావు, కె.నాగేశ్వరరావు, ఎం.ధనుంజయరావు, సయ్యద్‌ ఖాజా తదితరులు పాల్గొన్నారు.టిడిపి నాయకులు వల్లభనేని గిరి ప్రచారంప్రజాశక్తి – విస్సన్నపేట : లక్ష్మీపురం గ్రామం ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడిగా ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ఎన్నారై వల్లభనేని గిరి ఆధ్వర్యంలో వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలని ఎన్నికల ప్రచారం చేస్తు ఓట్లను అభ్యర్థించారు.జగన్మోహనరావు విజయాన్ని కాంక్షిస్తూ పర్యటనప్రజాశక్తి – చందర్లపాడు : ఆంధ్రప్రదేశ్‌లో జరుగు సార్వత్రిక ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్‌ ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు దొండపాటి సుధాకర్‌ మాదిగ చందర్లపాడు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి జగన్మోహనరావుని గెలిపించాలని కోరుతూ, తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బిజెపి పది ఏండ్లు దేశంలో అధికారంలో ఉండి వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసిన మోడీ, మరోసారి అధికారాన్ని కట్టబెడితే వర్గీకరణ చేస్తామని చెప్పడం మరోసారి మోసంచేయడమేనని అన్నారు. వర్గీకరణ అక్కర్లేదు మాదిగలకు ప్యాకేజీ ఇస్తానని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ రోజు వర్గీకరణ పాట పాడుతూ మాదిగలను మరోసారి మోసం చేయడానికి సిద్దపడ్డాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కనకపుడి వెంకటరత్నం మాదిగ,చందర్లపాడు మండల ఇంచార్జ్‌ మాదిగ, కోట సత్యానందం మాదిగ, సంఘం రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.నల్లగట్ల స్వామి దాస్‌ ప్రచారంప్రజాశక్తి విస్సన్నపేట : విసన్నపేట మండలం జానలగడ్డ, పుట్రెల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో ఆధారంగా ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ గడపగడపకు ప్రచారంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.తోట మూలలో టిడిపి ప్రచారంప్రజాశక్తి-గంపలగూడెం: సోమవారం రాత్రి ఎన్డీఏ అభ్యర్థుల గెలుపును కోరుతూ, పెద్దకొమెర-తోటమూల ఆ కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావులను సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా సంబంధిత కరపత్రాలను అందజేశారు.అభ్యర్థుల గెలుపును ప్రచారంప్రజాశక్తి – గంపలగూడెం : జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుని కాంక్షిస్తూ, కనుమూరులో ఆ పార్టీ నాయకులు చెరుకు నరసారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైసిపి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎంపీ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్‌ (నాని) ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాసులకు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.నల్లగట్ల స్వామిదాస్‌ ప్రచారంప్రజాశక్తి – తిరువూరు : వైసిపి అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి మాజీ జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ నల్లగట్ల సుధారాణి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. తిరువూరు నగర పంచాయతీలోని 19వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మేల్యే అభ్యర్థి స్వామిదాస్‌కు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సుధారాణి విజ్ఞప్తి చేశారు.

➡️