గుడ్లవల్లేరులో ‘మట్టల ఆదివారం’

Mar 24,2024 11:31 #ntr district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : యేరుషలేము వీధుల్లో ఏసు ప్రభువు ప్రయాణం చేసిన రోజునే మట్టల ఆదివారం అని పిలుస్తారని పాస్టర్ పిఎస్ .దేవదాస్ అన్నారు. మట్టల ఆదివారం పురస్కరించుకుని మండలంలోని ప్రార్థన మందిరాల్లో మట్టల ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల మానవాళి పాపం పరిహారార్ధం దేవుడే మానవుడై దిగి వచ్చి తన్ను తాను బలిపశువుగా శాపగ్రస్తమైన శిలువపై తన ప్రాణాన్ని అర్పించారు. అది గుడ్ ఫ్రైడే. ఆ బలియాగము కొరకు బలిపశువును ఊరేగించి బలిపీఠం వద్దకు తీసుకెళ్లునట్లు, యెరూషలేము వీధుల్లో యేసు ప్రభువు ఊరేగింపుగా ప్రయాణం చేసిన రోజునే ‘మట్టల ఆదివారం’ అని పిలుస్తారు. కృపా సువార్త ప్రార్ధన మందిరం ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాన రహదారులు మట్టలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అలాగే ఆర్.సి.యం, విశ్వాసుల సంఘం కవుతం, బాప్టిస్ట్ చర్చ్, సి ఎస్ ఐ, పలు సంఘాల పాస్టర్లు ప్రభాకర్ రావు, డాక్టర్ ప్రకాష్, ప్రేమ్ కుమార్, పి సురేష్ బాబు శ్వాసులు ఆయా చర్చల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు.

➡️