కీర్తిలాల్‌ జ్యుయలర్స్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం

Jun 24,2024 22:34

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : ‘2024-25′ సంవత్సరానికి అత్యంత ప్రాధాన్యమైన వర్క్‌ప్లేస్‌’లలో ఒకటిగా కీర్తిలాల్‌ కాళిదాస్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారిని అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ సహవ్యవస్థాపకులు రాజేష్‌ చాందినీ ఒక ప్రకటనలలో తెలిపారు. ఇటీవల డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో చాందిని, సహా-వ్యస్థాపకులు శరద్‌ గుప్తాతో కలిసి మాజీ పార్లమెంట్‌ సభ్యులు జయప్రద చేతుల మీదుగా కీర్తిలాల్స్‌ రిటైల్‌ సేల్స్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ముత్తుకుమార్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారని తెలిపారు.కీర్తిలాల్‌ జ్యుయలర్స్‌ వారికి ఈ పురస్కారం’టీమ్‌ మార్క్స్‌మెన్‌’ ఎంప్లాయి సెంట్రిసిటి, సంస్థాగత ప్రయోజనాలు, ఇంట్రాప్రేనీరియల్‌ పర్యావరణ వ్యవస్థ, పని పట్ల నమ్రత, వైవిధ్యత సమానత్వం, వృద్ధి, రివార్డులు, సామాజిక సమన్వయం వంటి అంశాలు ప్రామాణికతగా నిర్వహించిన సమగ్ర పరిశోధన ప్రేరణతో అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు.

➡️