ఎయిడ్స్‌పై అవగాహనా

May 19,2024 20:37

ప్రజాశక్తి – తిరువూరు : అంతర్జాతీయ ఎయిడ్స్‌ స్మారక దినోత్సవాన్ని తిరువూరు మండలం, మల్లేల సచివాలయం ఆధ్వర్యంలో మహిళలు గ్రామంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ మహమ్మారిని తరమికొట్టాలని, ఎయిడ్స్‌ ప్రాణాత్మక వ్యాధని, పరాయివ్యక్తులతో గానీ, మహిళలతో గానీ శారీరక సంబంధాలు కొనసాగించొద్దని తదితర నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్వైజర్‌ సుందరరావు, క్లస్టర్‌ లింక్‌ వర్కర్‌ సరిత తదితరులు పాల్గొన్నారు.

➡️