ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండివైఖరి వీడాలి

Dec 13,2023 16:51 #ntr district
anganwadi protest 2nd day ntr mylavaram

వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆపేది లేదు..

ప్రజాశక్తి-మైలవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీల సమస్యలపై మౌనం వేడాలి అధికారులతో చర్చించి వేతనాలు పెంచేందుకు తగిన నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం ఆగేది లేదని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా అంగనవాడి వర్కర్ల సమ్మెలో భాగంగా రెండవ రోజు మైలవరం సిడిపిఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారి హామీ నీటి మీద రాతలు మిగిలిపోయింది.2022లో సుప్రీం కోర్టు అంగన్వాడీలకు కూడా గ్రాడ్యుటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పు నేటికీ మన రాష్ట్రంలో అమలు కావటం లేదు మినీ సెంటర్లను మెయిల్ సెంటర్లు గా మార్చలేదు హెల్పర్స్ ప్రమోషన్ కు ఎటువంటి నిబంధన రూపొందించలేదు సెంటర్ల నిర్వహణ కు అంగన్వాడీలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెట్టబడ్డాం అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది సమస్యలపై మనం నిర్వహించిన ఆందోళనలపై తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. పోలీసులతో ముందస్తు అక్రమ అరెస్టులు చేయించి కేసులు పెట్టింది ఈ నేపథ్యంలో మన సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నేడు సమ్మె చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఈ సమ్మెలో లబ్ధిదారులు కార్మిక సంఘాలు ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు అభ్యుదయ ప్రజాస్వామ్యవాదుల మద్దతుతో అంగన్వాడి వర్కర్ల హెల్పర్లు మినీ వర్కర్లు అందరు పాల్గొని జయప్రదం చేయాలని’ కోరారు.

సీరియస్ ద్వారా గత 40 సంవత్సరాలుగా గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లలకు అనేక సేవలందిస్తున్నాను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదు ప్రభుత్వ ఉద్యోగులే పేరుతో సంక్షేమ పథకాల అమలు చేయడం లేదు రకరకాల యాపిల్ తెచ్చి పని భారం పెంచారు నిధులు కేటాయించకుండా లబ్ధిదారులకు నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారు తీసుకొచ్చారు ఫోన్లు పనిచేయకపోయినా నెట్ సిగ్నల్ లేకపోయినా అమలు చేయాలని అధికారులు అంగన్వాడీలను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ పర్యవేక్షణ పేరుతో ఫుడ్ కమిషనర్ ఎంఎస్కే ఎమ్మార్వో ఎండిఓ రాజకీయ నాయకులు ఇలా అనేకమంది విజిట్ల పేరుతో అవమానిస్తూ వేధిస్తున్నారు. సర్వీస్ లో ఉండి చనిపోయిన కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు సమస్యల పరిష్కరించాలని అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మార్చి 20వ తేదీ నిర్వహించిన ఆందోళన ఫలితంగా శాసన మండల్లో ఐసిడిఎస్ మంత్రి గారు ఇచ్చిన హామీ నెరవేరలేదు సెప్టెంబర్ 25న చలో విజయవాడ నిర్వహించిన ఫలితంగా అక్టోబర్ 9వ తేదీన ఐసిడిఎస్ డైరెక్టర్ గారితో చర్చలు జరిగిన సమస్యలు పరిష్కారం లేదు.

డిమాండ్స్
1) అంగన్వాడీలకు ముఖ్యమంత్రి గారి హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి
2) సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలి ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి
3) రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలి
4) ఎఫ్ ఆర్ ఎస్ సి ఆపు రద్దు చేయాలి అన్ని యాప్లు కలిసి ఒకే యాప్ గా మార్చాలి
5) హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సం”పెంచాలి రాజకీయ జోక్యం అరికట్టాలి
6) వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ సౌకర్యం కల్పించాలి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల పెంచాలి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి
7) వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలి పెండింగ్లో ఉన్న అద్దెలు 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఏ బిల్లులు వెంటనే చెల్లించాలి
8) సర్వీసులో ఉండగా చనిపోయిన కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వాలి బీమా సౌకర్యం అమలు చేయాలి
9) లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి ఆయిల్ కందిపప్పు క్వాంటిటీ పెంచాలి
*ఈ కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు , ఆర్ వి వి పుష్ప కుమారి, కార్యదర్శి సిహెచ్ శారద , సెక్టార్ లీడర్స్ విజయలక్ష్మి, మాణిక్యం, రబ్బానీ, బుల్లెమ్మ, నిర్మల, కుమారి, లక్ష్మి, జి కొండూరు సిఐటియు మండల కార్యదర్శి కే బాలకృష్ణ అధ్యక్షులు ఎస్ సుందర్రావు తదితరులు పాల్గొన్నా

➡️